యాప్నగరం

రోబో బస్సు: దీనికి డ్రైవర్ అక్కర్లేదు!

టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే జపాన్.. త్వరలో మరో అద్భుతాన్ని పరిచయం చేయనుంది. డ్రైవర్ అవసరం లేని ‘రోబోట్ షటిల్’ బస్సును సిద్ధం చేసింది.

TNN 9 Nov 2017, 4:05 pm
టోక్యో: టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే జపాన్.. త్వరలో మరో అద్భుతాన్ని పరిచయం చేయనుంది. డ్రైవర్ అవసరం లేని ‘రోబోట్ షటిల్’ బస్సును సిద్ధం చేసింది. దీన్ని ప్రజా రవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు సన్నహాలు మొదలుపెట్టింది. గూగుల్ ఇప్పటికే సెల్ఫి డ్రైవింగ్ కార్లను ప్రయోగించినా, ఇంకా అందుబాటులోకి తేలేదు. అయితే, జపాన్ ముందుగా ఒక నగరంలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయించింది. టోక్యో సమీపంలోని చిబా, అకితా సమీపంలోని సెమ్బోకు ప్రాంతాల్లో ఈ బస్సులు నడుపుతున్నారు. 2018 కల్లా రోడ్డెక్కించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. ​వెబ్ ఆపరేటర్ డెనా(DeNA) ఈ మినీ రోబో షటిల్ బస్సులను నిర్వహిస్తోంది.
Samayam Telugu video japans first driverless bus robot shuttle to begin service in chiba
రోబో బస్సు: దీనికి డ్రైవర్ అక్కర్లేదు!


ఈ బస్సులో ఒకేసారి ఆరుగురు కూర్చొని ప్రయాణించవచ్చు. మరో నలుగురు నిలుచునేందుకు కూడా చోటు ఉంది. పూర్తిగా బ్యాటరీ సాయంతోనే ఇది నడుస్తుంది.
డ్రైవర్ అవసరం లేకుండా ఇవి ఎలా ప్రయాణిస్తాయో ఈ వీడియోలో చూడండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.