యాప్నగరం

అబ్బాయిలు అందుకే ఎక్కువగా ఏడ్వరట!

భావోద్వేగాల విషయంలో పురుషులు, మహిళలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా.. అమ్మాయిలు వెక్కివెక్కి ఏడుస్తారు. అబ్బాయిలు మాత్రం అంత తేలిగ్గా బయటపడరు. కారణం?

TNN 29 Dec 2017, 10:19 pm
భావోద్వేగాల విషయంలో పురుషులు, మహిళలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా.. అమ్మాయిలు వెక్కివెక్కి ఏడుస్తారు. వారి కళ్లలోంచి కన్నీటి ధారలు ఉబికి వస్తాయి. కానీ, అబ్బాయిలు మాత్రం అంత తేలిగ్గా బయటపడరు. ఎంత కష్టం వచ్చినా.. సాధారణంగా వారి కళ్లు చెమర్చవు. మరి వారికీ బాధ కలుగుతుంది కదా! అయినా వారి కంట్లో నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదు? వారికి మాత్రం ఫీలింగ్స్‌ ఉండవా? స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, పరిశోధకుడు నోరా మరియా రసెల్‌ బృందం చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Samayam Telugu why women are more emotionally expressive than men
అబ్బాయిలు అందుకే ఎక్కువగా ఏడ్వరట!


అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేర్వేరుగా ఉంటుందని రసెల్‌ బృందం గుర్తించింది. అంతేకాకుండా అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం అధికంగా ఉంటుందట. ఈ కారణంగానే వారిలో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఎక్కువ అని, మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని రసెల్ బృందం చెబుతోంది. 189 మందిపై పరిశోధన చేసినట్లు రసెల్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.