యాప్నగరం

కొత్త వ్యాధి: పాములు అంతరిస్తున్నాయ్!

జీవపరిణామ క్రమంలో కీలకమైన కీటకంగా పేరొందిన పాములు అంతరిస్తున్నాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఓ భయానకమైన వ్యాధి కారణంగా పాములు క్రమేనా అంతరించేపోయే దశకు చేరుకున్నాయని పేర్కొంది.

TNN 22 Dec 2017, 5:04 pm
జీవపరిణామ క్రమంలో కీలకమైన కీటకంగా పేరొందిన పాములు అంతరిస్తున్నాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఓ భయానకమైన వ్యాధి కారణంగా పాములు క్రమేనా అంతరించేపోయే దశకు చేరుకున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాధి అమెరికా, ఐరోపా దేశాలకు పాకిందని, ఇప్పటికే చాలావరకు పాములు చనిపోయాయని సర్వే వెల్లడించింది. ఓఫిడియోమీసెస్ ఓఫోడియోయికోలా అనే బ్యాక్టీరియా ప్రభావంతో సోకిన ఫంగల్ వ్యాధి క్రమేనా ఖండాతరాలకు సైతం విస్తరిస్తోందని సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన ఈ సర్వేలో వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా అనకొండ వంటి పెద్ద పాముల నుంచి చిన్న పాముల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతోందని తెలిపింది.
Samayam Telugu will snakes disappear from earth lethal fungal disease spreading fast
కొత్త వ్యాధి: పాములు అంతరిస్తున్నాయ్!


అమెరికన్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ (AMNH), అమెరికా జియోలాజికల్ సర్వే, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లకు చెందిన పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. పాములు అంతరించడం అనేది చిన్న సమస్య కాదని, దీనివల్ల జీవ పరిణామానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పరిశోధకులు వాపోతున్నారు. ఈ ఫంగల్ వ్యాధి వల్ల అమెరికాలో ఇప్పటికే 23 రకాల పాములు అంతరించాయని సర్వే వెల్లడించింది. ఈ ఫంగస్ సోకిన పాముల చర్మంపై బొడిపెలు ఏర్పడుతాయని, అవి క్రమేనా వాటి శరీరమంతా పాకి చనిపోతాయని పేర్కొంది.

ఫంగల్ వ్యాధి సోకిన పాముకు దురదలు ఏర్పడటం వల్ల సూర్య రశ్మి కోసం బయటకు వస్తాయని, అచేతన స్థితిలో ఉండే వాటిని పక్షులు, గెద్దలు వేటాడి చంపుతున్నాయని సర్వేలో చెప్పారు. పర్యవరణ సమతుల్యం కోసం పాములు తదితర కీటకాల అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే, పర్యవరణలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. అవి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చెప్పడం కూడా కష్టమేనని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫంగల్ వ్యాధి నియంత్రణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Photo: USGS National Wildlife Health Center/D.E. Green

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.