యాప్నగరం

లైవ్: ఆకాశంలో మూడు అద్భుతాలు.. ఒకేసారి!

మళ్లీ ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడాలంటే 2037 వరకు ఆగాల్సిందే.

TNN 31 Jan 2018, 8:04 pm
ప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుతం ఎట్టకేలకు ఆకాశంలో ఆవిష్కృతమైంది. దాదాపు 152 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అంతా ఆసక్తి చూపారు. మళ్లీ ఇలాంటి చంద్ర గ్రహణాన్ని చూడాలంటే 2037 వరకు వేచి చూడాల్సిందే. సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీంతో ఎప్పుడూ కనిపించే పరిమాణం కంటే 14 శాతం పెద్దదిగా, 50 శాతం కాంతివంతగా చంద్రుడు కనిపిస్తాడు.
Samayam Telugu world witnesses rare super blue blood moon
లైవ్: ఆకాశంలో మూడు అద్భుతాలు.. ఒకేసారి!


ఇదే సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడిన నేపనథ్యంలో గ్రహణాన్ని అత్యంత సమీపంలో వీక్షించే అవకాశం కలిగింది. ఇక మూడో ప్రత్యేకత అన్నింటికంటే అరుదైనది. నిత్యం తెల్లని వర్ణంలో వెన్నెల కురిపించే చంద్రుడు రెండు భిన్నమైన రంగుల్లో దర్శనమివ్వడం. భూమి అడ్డం రావడం వల్ల చంద్రుడిపై పూర్తిగా సూర్యుడి కాంతి పడదు.

దీనివల్ల సన్నని కిరణాలు చంద్రుడిని తాకి రెండు భిన్నమైన రంగుల్లో కనిపిస్తుంది. అయితే, బ్లూ మూన్ కంటే.. బ్లడ్ మూన్‌గానే ఎక్కువగా కనిపిస్తాడు. మళ్లీ ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడాలంటే 2037 వరకు ఆగాల్సిందే.
ఆ అద్భుతాన్ని ఇక్కడ లైవ్‌లో చూడండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.