యాప్నగరం

'నన్ను క్షమించండి' అంటే పోయేదేం లేదు!

ప్రపంచ శాంతికి ద్వారాలు తెరిచే వరల్డ్ ఫర్‌గివ్‌నెస్ డే ముగింపు ఉత్సవాలని జైనులు వేడుకగా జరుపుకున్నారు.

TNN 26 Aug 2017, 9:31 pm
ప్రపంచ శాంతికి ద్వారాలు తెరిచే వరల్డ్ ఫర్‌గివ్‌నెస్ డే ముగింపు ఉత్సవాలని జైనులు వేడుకగా జరుపుకున్నారు. హైదరాబాద్ రాణిగంజ్‌లోని టీ-19 టవర్ జంక్షన్ వద్ద జరిగిన ఈ వరల్డ్ ఫర్‌గివ్‌నెస్ డే ముగింపు వేడుకలకి దాదాపు 15000 మంది జైనులు హాజరయ్యారు. వీరిలో దాదాపు 99 శాతం మంది ఉపవాస దీక్షను పాటించి తామంతా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. హైదరాబాద్‌లో వున్న జైనులు అంతా తమ నివాసాలని అందంగా అలంకరించుకుని స్మార్ట్ ఫోన్లు, సినిమాలు, విలాసవంతమైన జీవితానికి దూరంగా సాదాసీదాగా ఈ ముగింపు వేడుకలని సెలబ్రేట్ చేసుకున్నారు.
Samayam Telugu 15000 jains grace closing ceremony of 8 day world forgiveness day
'నన్ను క్షమించండి' అంటే పోయేదేం లేదు!


హైదరాబాద్‌లో వున్న జైన మతస్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న లక్షలాది జైనులు మహా పర్యుషన పర్వ్ పేరిట ఆగస్టు 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ వరల్డ్ ఫర్‌గివ్‌నెస్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు ఈ వేడుకలు ముగింపునకి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న జైనులంతా తమ దైనందిన కార్యక్రమాలని పక్కకుపెట్టి అత్యంత సాధారణ పద్ధతిలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలని తమ మతస్తులు ఎంతో శ్రద్ధగా జరుపుకుంటారు అని పేర్కొన్నారు ప్రవీణ్ రుషి ఉపాధ్యాయ అనే ప్రముఖ జైన సాధువు. ఈ వారం రోజులపాటు ఉపవాస దీక్షలు పాటించి, ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలతో తమ ఆత్మ పరిశుద్ధి చేసుకోవడం జరుగుతుంది అని ప్రవీణ్ రుషి ఉపాధ్యాయ తెలిపారు. పనిచేసే చోట పేదవారికి ఈ వారం రోజులపాటు అన్నదానం చేయడం, గోవులకి దాన వేయడం, ఆపదలో వున్న వారికి దానధర్మాలు చేయడం వంటివన్నీ జైనులు ఈ వారం రోజులపాటు ఆచరించే పద్ధతుల్లో ఓ భాగం కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.