యాప్నగరం

రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారి

18 నెలల చిన్నారి బోరు బావిలో పడిపోయిన ఘటన గురువారం సాయంత్రం రంగా రెడ్డి జిల్లా...

Samayam Telugu 22 Jun 2017, 9:28 pm
18 నెలల చిన్నారి బోరు బావిలో పడిపోయిన ఘటన గురువారం సాయంత్రం రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఘటనాస్థలం వద్దే వుండి పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు.
Samayam Telugu 18 months old baby girl falls into open borewell
రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారి


బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సహాయక సిబ్బంది మరోవైపు బోరు బావికి సమాంతరంగా జేసీబీల సహాయంతో భారీ గొయ్యి తవ్వుతున్నారు. ఎప్పుడు, ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఆందోళన ఇక్కారెడ్డిగూడలో నెలకొని వుంది. బోరుబావుల్లో చిన్నారులు పడి దుర్మరణంపాలవుతున్న దుర్ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నా... తెరిచి వుంచిన బోరు బావులని స్వచ్ఛందంగా మూసేయడంలో బోరుబావుల యజమానులు నిర్లక్ష్యం వహిస్తుండటం, వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.