యాప్నగరం

బోరుబావిలో పడిన 2 ఏళ్ల బాలుడు

స్వాతంత్య్ర దినోత్సం వేళ గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

TNN 15 Aug 2017, 6:52 pm
స్వాతంత్య్ర దినోత్సం వేళ గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరంలో చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. 15 అడుగుల లోతులో బాలుడి కదలికలు గుర్తించామని స్థానిక రెవిన్యూ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. బాలుడికి ఆక్సీజన్ అందిస్తూనే బోరు బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి బాలుడిని బయటికి తీసుకొచ్చేందుకు స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Samayam Telugu 2 years old boy fell in borewell in andhra pradeshs guntur district
బోరుబావిలో పడిన 2 ఏళ్ల బాలుడు


ప్రస్తుతానికి స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు మాత్రమే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయకచర్యల్లో పాల్గొనేందుకు పిట్టంబండ ఉమ్మడివరం బయల్దేరాయి. మరికాసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుంటాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.