యాప్నగరం

అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు..

ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు..

TNN 29 Jun 2017, 3:24 pm
ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మందిపై ఆరోపణలు రాగా.. 10 మందిపై కేసు కొట్టేసిన కోర్టు నిందితుల్లో నలుగురిని దోషులుగా నిర్ధారించింది. మరొక వ్యక్తి కేసు దర్యాప్తులో ఉండగానే మరణించాడు. హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌ను ప్రధాన దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు చెప్పింది. కేసులో మరో కీలక వ్యక్తి మహమ్మద్ పహిల్వాన్‌ను కోర్టు.. నిర్దోషిగా తేల్చడం గమనార్హం. దోషులుగా గుర్తించిన వారికి శుక్రవారం (జూన్ 30) శిక్షలు ఖరారు చేయనున్నారు. నిందితులందరినీ గురువారం ఉదయం.. ప్రత్యేక బందోబస్తు మధ్య చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు.
Samayam Telugu 2011 attack on akbaruddin owaisi 4 convicted mohammed pahelwan acquitted
అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు..


2011 ఏప్రిల్ 30న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్‌ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా.. నిందితులు ఆయనపై దేశవాలీ తుపాకీలతో కాల్పులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.