యాప్నగరం

పనిమనిషితో ఎఫైర్... వెబ్‌సైట్‌లో వీడియోలు పెట్టిన టెక్కీ

హైదరాబాద్‌లో ఓ టెక్కీ చేసిన పని సంచలనంగా మారింది. తన ఇంట్లో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని... వారిద్దరు ఏకాంతంగా గడుపుతున్న వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.

TNN 27 Feb 2018, 12:19 pm
హైదరాబాద్‌లో ఓ టెక్కీ చేసిన పని సంచలనంగా మారింది. తన ఇంట్లో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని... వారిద్దరు ఏకాంతంగా గడుపుతున్న వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అతడిలోని వికృత రూపాన్ని కూడా బయటపెట్టాయి. నగరానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. అయితే రోజూ ఇంట్లో పనిచేసేందుకు ఓ మహిళను నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని నాగేశ్వరరావు... పనిమనిషితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కెమెరాతో రికార్డు చేశాడు.
Samayam Telugu 28 year old techie posts intimate home maid video on porn site
పనిమనిషితో ఎఫైర్... వెబ్‌సైట్‌లో వీడియోలు పెట్టిన టెక్కీ


రికార్డు చేసిన వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు నాగేశ్వరరావు ఆ వెబ్‌సైట్‌కు ప్రీమియమ్ మెంబర్ కూడానట. ఇలా వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా డబ్బు ఇచ్చేవాళ్లు. ఇలా తరచూ పోస్ట్ చేసేవాడు. అయితే ఒకరోజు ఈ వీడియోను బాధితురాలి కుమారుడి ఫ్రెండ్ చూశాడు. జరిగిన విషయాన్ని అతడికి చెప్పడంతో... వాళ్ల అమ్మకు చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.