యాప్నగరం

స్కూల్ సంపులో పడి చిన్నారి దుర్మరణం

బాలల దినోత్సవం రోజే ఓ చిన్నారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

TNN 14 Nov 2017, 8:21 pm
బాలల దినోత్సవం రోజే ఓ చిన్నారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ మూడేళ్ల చిన్నారి బలైపోయాడు. స్కూల్‌లో ఉన్న సంపు తెరిచి ఉండటంతో దాన్ని గమనించిన ఆ చిట్టి తండ్రి అందులో పడి మరణించాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహించడమే కాకుండా.. ప్రశ్నించిన బాలుడి తల్లిదండ్రులకు యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ కిటికీల అద్దాలను పగలగొట్టారు. స్థానికులతో కలసి స్కూల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu 3 year old child dies after falling in schools water tank in hyderabad
స్కూల్ సంపులో పడి చిన్నారి దుర్మరణం


మల్కాజ్‌గిరికి చెందిన శివ్ రచిత్ అనే మూడేళ్ల చిన్నారి స్థానిక బచ్‌పన్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. మూడంతస్థుల భవనంలో ఈ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇలా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు. అయితే మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సరదాగా ఆటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం స్కూల్‌కి వెళ్లిన శివ్ రచిత్.. బొమ్మలు ఉన్న చోటు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అతను లోపలికి వెళ్లే మార్గంలో సంపు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని స్కూల్ సిబ్బంది ఎవరూ గ్రహించలేదు.

కొంత సేపటికి మీ బాబు స్కూలుకి రాలేదంటూ చిన్నారి తల్లికి సిబ్బంది ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన స్కూల్‌కి చేరుకున్న శివ్ తల్లి.. అక్కడే వెతకారు. తెరిచి ఉన్న సంపులో బాబు తేలియాడుతూ ఉండటాన్ని చూసి షాక్‌కి గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది వచ్చి బాబును బయటికి తీయగా అప్పటికే మరణించాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. చిన్న పిల్లలు ఉండే స్కూల్‌లో సంపు ఎలా తెరిచి ఉంచుతారని ప్రశ్నించిన ఆ తల్లికి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో స్థానికులతో కలసి ఆమె ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా ఇంకా బచ్‌పన్ స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.