యాప్నగరం

వీధి కుక్కలపై బుడతడి సాహసం..!

రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా..

TNN 29 May 2017, 1:18 pm
తనపై దాడి చేయడానికి చుట్టు ముట్టిన శునకాలపై ఓ బుడతడు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. వీధి కుక్కలు భౌ.. భౌ.. మంటూ మీదకొస్తున్నా.. ఏమీ తెలియని వయసులో ఏమాత్రం తొణకకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎదిరించాడు. బాలుడి ధైర్యానికి తలొంచిన ఆ వీధి కుక్కలు తోక ముడుచుకొని, పక్కకు తప్పుకున్నాయి. హైదరాబాద్‌లోని మూసాపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. మూసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో కృష్ణ, రేణుక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చందూ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబం మే 26న జనతానగర్‌లో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది.
Samayam Telugu 6 years old boy shows braveheart on stray dogs in hyderabad
వీధి కుక్కలపై బుడతడి సాహసం..!


అందరూ పెళ్లి వేడుకల్లో మునిగిపోయి ఉండగా.. చందూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో వరసకు సోదరి అయ్యే బాలిక (5)తో కలిసి ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లిపోయాడు. అక్కడ నడుచుకుంటూ వెళుతున్న చిన్నారులపైకి వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. వెంటనే ఆ బాలిక భయంతో దూరంగా పారిపోయింది. ఆ శునకాలు చందూను చుట్టు ముట్టాయి. అయినా.. ఆ బుడతడు ధైర్యంగా అక్కడే నిల్చున్నాడు. ‘రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా..’ అనే లెవల్లో ఫోజిచ్చాడు. బిగ్గరగా అరుస్తూ వాటిని బెదరగొట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌‌చల్‌ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.