యాప్నగరం

7.26 లక్షల ఎకరాల అడవుల్ని ఆక్రమించేశారు!

తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఆక్రమణకు గురవుతున్నాయి. 7. 26 లక్షల ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు..

TNN 12 Sep 2017, 2:41 pm
తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద ఆక్రమణకు గురవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 7.26 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూములు ఆక్రమణలో ఉన్నాయని తేలింది. మరో 1.5 లక్షల ఎకరాల విషయంలో రెవెన్యూ శాఖతో అటవీ శాఖకు వివాదాలున్నాయి. సాధారణంగా పట్టణాల్లో భూములు ఎక్కువ ధర పలుకుతాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతాయి. కానీ తెలంగాణలో మాత్రం అటవీ శాఖకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
Samayam Telugu 7 26 lakh acre of forests encroached in telangana
7.26 లక్షల ఎకరాల అడవుల్ని ఆక్రమించేశారు!


గ్రామీణ ప్రాంత ప్రజలు అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తుండటం, ప్రభుత్వమే వాటిని పేదలకు పంచి పెడుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. లక్షన్నర ఎకరాల అటవీ భూముల విషయంలో రెవెన్యూ శాఖతో వివాదాలు ఉండగా.. మరో మూడు లక్షల ఎకరాల భూమిని గిరిజనులు సాగు కోసం ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 15 నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభం కానుంది. దీంతో రెవెన్యూ శాఖతో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన తరుణమని అటవీ శాఖ భావిస్తోంది. తెలంగాణలో 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవులను ఆక్రమణల నుంచి కాపాడుకోవడం తమ తొలి ప్రాధాన్యమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.