యాప్నగరం

త్వరలో 7వేల టీచర్ పోస్టుల భర్తీ: కడియం

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 7వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి,

Samayam Telugu 23 Mar 2017, 8:15 pm
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 7వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు వేల పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యా బోధన ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
Samayam Telugu 7000 teacher posts to be filled soon says dy cm kadiam srihar
త్వరలో 7వేల టీచర్ పోస్టుల భర్తీ: కడియం


వచ్చే జూన్ నాటికి 5,600 ప్రభుత్వం పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని కడియం పేర్కొన్నారు. ఈ నెల మార్చి 21 నుంచే వచ్చే విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టామని గుర్తుచేశారు.

విద్యాశాఖకు ఈ సారి బడ్జెట్ లో రూ.12,075కోట్లు కేటాయించినట్లు కడియం తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 529 గురుకుల పాఠశాల్లో అన్ని వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.