యాప్నగరం

వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ వాహనదారులకు ఇది శుభవార్తే. ఇకనుంచి ఇందనం కనిపించే విధంగా పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగించనున్నారు.

Samayam Telugu 28 Aug 2018, 7:09 am
తెలంగాణ వాహనదారులకు ఇది శుభవార్తే. ఇకనుంచి ఇందనం కనిపించే విధంగా పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగించనున్నారు. తనిఖీలప్పుడు.. పారదర్శకత జవాబుదారీపై తూకంలో 5 లీటర్ల జార్‌తో నాణ్యత పరీక్షలు చూపాలని తెలంగాణ తూనికలు, కొలతలు శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టంచేశారు. నాణ్యతలో పారదర్శకతే లక్ష్యంగా..ఇంధ‌న తూకానికి. .ప్రత్యేకంగా రూపొందించిన 5 లీటర్ల గ్లాస్ జార్‌ను త్వరలో తెలంగాణలో వినియోగంలోకి రానుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ కొలతల్లో నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకంగా ఉండేలా తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. తనిఖీల సమయంలో వినియోగదారులకు, పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు స్పష్టంగా కనిపించే విధంగా గ్లాస్‌తో చేసిన పరికరాన్ని అందుబాటులోకి తెస్తోంది.
Samayam Telugu తెలంగాణ తూనికలు, కొలతలు శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్


తనిఖీలో పారదర్శకతను, జవాబు దారీతనాన్ని పెంపొందించేందుకు, తూకం, నాణ్యతలను తనిఖీ చేయడానికి గ్లాస్‌తో తయారు చేసిన 5 లీటర్ల జార్‌ ప్రవేశపెడుతున్నారు. నాణ్యత, తూకం పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం రాగితో చేసిన 5 లీటర్ల జార్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ జార్లో టెంపరేచర్, హ్యాండ్లింగ్ల వల్ల తనిఖీల సమయంలో వేరియేషన్ (సరైన తూకం) కొన్ని సందర్భాల్లో తేడా వస్తోంది. కొత్తగా గ్లాస్‌తో చేసిన ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ పెట్రోలియం గ్లాస్ జార్‌తో వంద శాతం తూకంతో ఏ మాత్రం తేడా ఆస్కారం ఉండదు. ఈ గ్లాస్ జార్ నాణ్యమైన యుఎస్పి టైప్ క్లాస్-ఎతో తయారు చేయ‌బడింది. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడడంతో పాటు సరైన తూకాన్ని సూచిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.