యాప్నగరం

ఇంట్లో 300పైగా పాములు... కంగుతిన్న రైతు..!

తన ఇంటి ఆవరణలో వందల సంఖ్యలో పాముపిల్లలు బయటకు రావడంతో... ఓ రైతు కంగుతిన్నాడు. ఈ సంఘటన.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో జరిగింది.

Samayam Telugu 31 Mar 2018, 7:12 pm
తన ఇంటి ఆవరణలో వందల సంఖ్యలో పాముపిల్లలు బయటకు రావడంతో... ఓ రైతు కంగుతిన్నాడు. ఈ సంఘటన.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చాకలి మొగులప్ప అనే రైతు ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. ఆయన తమ్ముడు హుసేనప్ప... తన కాలికి దెబ్బ తగలడంతో... కట్టుకట్టేందుకు కొన్ని ఆకులు తెచ్చుకుని... ఇంటి ఆవరణలో ఉన్న రాతిపై నూరుతున్నాడు. ఇంతలో ఆ బండ సందులోంచి రెండు పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో భయపడ్డవారు... ఇతరు సహాయంతో.. కొట్టి చంపేశారు. మరికొద్ది సమయానికి ఒక్కొక్కటిగా పదుల సంఖ్యలో పాములు బయటకు రావడాన్ని గమనించిన వారు.. ఒక్క‌సారిగా భ‌యానికి లోన‌య్యారు. గ్రామస్థుల సాయంతో... కట్టెలతో కొడుతూ వాటిని చంపారు.
Samayam Telugu snaks


అనంతరం గుమ్మం చుట్టూ పరిచి ఉన్న నాపరాయి బండలను తొలగించడంతో కుప్పల కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. పాము గుడ్లు కూడా కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సుమారు 300 పాములు, పాము గుడ్లు బయట పడ్డాయి. అవన్నీ కూడా విషపూరిత పాములే అని గ్రామస్థులు గుర్తించారు. దీంతో వాటన్నింటినీ ఒక దగ్గర వేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.