యాప్నగరం

ఇల్లా.. చీరల దుకాణమా.. ఇదెక్కడి అవినీతి!

ఓ అధికారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ అక్కడ గుట్టలుగా పట్టు చీరలను చూసి అవాక్కైంది. సదరు అధికారి ఏకంగా దేవుడి సొమ్మునే దోచేసి రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ మేడిపల్లి విజయరాజు నివాసంలో బుధవారం సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టింది.

TNN 8 Nov 2017, 9:04 pm
ఓ అధికారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ అక్కడ గుట్టలుగా పట్టు చీరలను చూసి అవాక్కైంది. సదరు అధికారి ఏకంగా దేవుడి సొమ్మునే దోచేసి రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ మేడిపల్లి విజయరాజు నివాసంలో బుధవారం సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టింది. ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి.. విజయవాడ, హైదరాబాద్‌లోని విజయరాజు ఇళ్లలో సోదాలు చేపట్టారు. బట్టల దుకాణాలను తలపించేలా ఇళ్లలో పెద్ద మొత్తంలో పట్టు చీరలను చూసి అధికారులు నిర్ఘాంతపోయారు.
Samayam Telugu acb finds 547 silk sarees from endowment officer vijaya raju
ఇల్లా.. చీరల దుకాణమా.. ఇదెక్కడి అవినీతి!


హైదరాబాద్‌లోని ఓ నివాసంలో 464, విజయవాడలోని మరో నివాసంలో 73.. మొత్తం 547 పట్టు చీరలను గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వాటిలో కొన్ని అత్యంత ఖరీదైన చీరలు కూడా ఉన్నాయి. ఒక్కో చీర ధర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

దేవాదాయ శాఖలో ప్రస్తుతం సహాయ కమిషనర్‌గా ఉన్న విజయరాజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పర్యవేక్షిస్తుంటారు. గతంలో హైదరాబాద్‌, పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో ఆయన అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఆయన అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.