యాప్నగరం

డిసెంబరు 15లోగా హైకోర్టు భవన నిర్మాణం పూర్తి.. సుప్రీంకు ఏపీ సర్కార్ క్లారిటీ

హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ.. డిసెంబర్‌ 15నాటికి అమరావతిలో తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందంటున్న ఏపీ సర్కార్..

Samayam Telugu 29 Oct 2018, 5:21 pm
ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నూతన భవనాల నిర్మాణంతో పాటూ హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి కీలక సమాచారం అందించింది. డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని.. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ ప్రభుత్వం తరపును సీనియర్ అడ్వొకేట్ నారీమన్‌ కోర్టుకు తెలిపారు.
Samayam Telugu Supreme.


దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌.. ఏపీ సర్కార్ అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు. అలాగే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది. భవనాల నిర్మాణంపై రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కూడా కోర్టుకు సమర్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.