యాప్నగరం

మాజీ మంత్రి అచ్చెన్నకు షాక్.. ఆయన ఎన్నిక చెల్లదా!

టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదా.. ఓ అరెస్ట్ వారెంట్ గురించి అచ్చెన్న ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదా. వైసీపీ నేత చేస్తున్న వాదనలో నిజమేంత.

Samayam Telugu 8 Jul 2019, 9:04 pm
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదంటున్నారు వైసీపీ నేత పేరాడ తిలక్. ఎన్నికల అఫిడవిట్‌లో అచ్చెన్న తప్పు చేశారని.. ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడంటున్నారు. ఎన్నికల సంఘం స్పందించి.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటున్నారు త్వరలోనే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
Samayam Telugu naiduu


అచ్చెన్నాయుడు తన ఎన్నికల అఫిడవిట్‌లో.. తనపై అరెస్ట్‌ వారెంట్‌ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని తిలక్ ఆరోపిస్తున్నారు. 2007లో మైనింగ్‌ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్‌ పోలీస్‌ స్టేషన్‌ క్రైమ్‌ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ ఇంకా పెండింగ్‌లో ఉందంటున్నారు. ఓబుళాపురం మైనింగ్‌ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా ఆయనపై వారెంట్‌ ఉందని గుర్తు చేస్తున్నారు. వారెంట్ ఉన్న విషయాన్ని అచ్చెన్న దాచిపెట్టారని.. ఆయన ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయిస్తానంటున్నారు.

అచ్చెన్న మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చాలాచోట్ల వైసీపీ అభ్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కొందరు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కొందరు కేసుల గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించకపోతే.. మరికొందరు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.