యాప్నగరం

లోక్‌సభలో అవిశ్వాసంపై మళ్లీ అదే డ్రామా

లోక్‌సభలో ఈరోజైనా అవిశ్వాసం చర్చకు వస్తుందని అందరూ అనుకున్నారు. సేమ్ సీన్ ఏం మార్పు లేదు. ఎప్పటిలాగే వాయిదాలపర్వం కొనసాగింది. పట్టుమని పది నిమిషాలు కూడా సభ జరగలేదు. మళ్లీ రేపటికి వాయిదా.

Samayam Telugu 27 Mar 2018, 12:57 pm
లోక్‌సభలో ఈరోజైనా అవిశ్వాసం చర్చకు వస్తుందని అందరూ అనుకున్నారు. సేమ్ సీన్ ఏం మార్పు లేదు. ఎప్పటిలాగే వాయిదాలపర్వం కొనసాగింది. పట్టుమని పది నిమిషాలు కూడా సభ జరగలేదు. మళ్లీ రేపటికి వాయిదా. ఉదయం సభ ప్రారంభంకాగానే అన్నా డీఎంకే ఎంపీలు నేరుగా స్పీకర్ పోడియంలోకి దూసుకొచ్చారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా స్పీకర్ సభను గంటపాటూ వాయిదా వేశారు. తిరిగి మళ్లీ సభ ప్రారంభంకాగానే... అదే పరిస్థితి. సభకు సహకరించాలని సుమిత్రా మహాజన్ పదే, పదే వారించినా అన్నా డీఎంకే ఎంపీలు వెనక్కు తగ్గలేదు.
Samayam Telugu Lok Sabha


ఈ గందరగోళం మంత్రులు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టింది. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని...బీజేపీ సిద్ధమా? అని కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని సెటైర్ వేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ స్పందించారు. అవిశ్వాసంపై చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. సభలో గందరగోళ పరిస్థితలు అదుపు చేయాల్సి బాధ్యత కూడా ఉందని... ఈ సమయంలోనే చర్చ చేపట్టలేకపోతున్నామని చెప్పారు.

సహనం కోల్పోయిన కాంగ్రెస్ సభ్యులు... అన్నా డీఎంకే ఎంపీలపైకి దూసుకెళ్లారు. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. వెంటనే మార్షల్స్ అడ్డుకోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది. తర్వాత కేంద్రంపై పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని స్పీకర్ సభలో ప్రకటించారు. సభలో గందరగోళ పరిస్థితి వల్ల అవిశ్వాసంపై చర్చ జరపలేమన్న స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.