యాప్నగరం

ఏలూరు: అగ్రిగోల్డ్ సీతారామారావుకు రిమాండ్‌

అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడు, ఆ సంస్థ మాజీ డైరక్టర్‌ అవ్వా సీతారామారావుకు కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. అనంతరం అతణ్ని ఏలూరు జైలుకు తరలించారు.

Samayam Telugu 24 May 2018, 3:05 pm
అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడు, ఆ సంస్థ మాజీ డైరక్టర్‌ అవ్వా సీతారామారావుకు కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోర్టు గురువారం (మే 24) సీతారామారావుకు రిమాండ్ విధించింది. పోలీసులు వెంటనే.. సీతారామారావును ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. గత మూడేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న సీతారామారావును ఢిల్లీలోని గుర్గావ్‌లో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టు చేసిన 48 గంటల లోగా పోలీసులు ఆయణ్ని పశ్చిమగోదావరి జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు.
Samayam Telugu sitarama rao


అగ్రిగోల్డ్‌ కేసులో సీతారామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. 1997 నుంచి 2013 వరకు అగ్రిగోల్డ్ ‌డైరెక్టర్‌గా ఉన్న సీతారామారావు సంస్థకు సంబంధించిన ఆస్తులను బినామీల పేర్ల మీదకు మళ్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్‌ సంస్థను ఏఎస్‌ఎల్‌ సంస్థ టేకోవర్ ‌చేసుకోకుండా అవరోధాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కుటుంబసభ్యులకు బెయిల్‌ ఇప్పించడానికి సీతారామారావు అజ్ఞాతం నుంచే ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సీతారామారావును గుర్గావ్‌లో అరెస్టు చేసిన సమయంలోనే ఆయన ఇంట్లో పోలీసులు విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.