యాప్నగరం

జగన్‌ నా మిత్రుడు.. ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తా: అసద్

ఏపీలో చంద్రబాబుపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంచి మిత్రుడు.. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తా.

Samayam Telugu 12 Dec 2018, 7:08 pm
ఏపీలో టీడీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రజల్లో చంద్రబాబుపై చాలా వ్యతిరేకత ఉందని.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేసీఆర్ మాత్రమే కాదు.. తాను ఏపీలో అడుగుడు పెడతానని కుండ బద్దలు కొట్టేశారు. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయాలపై మాట్లాడిన అసద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu asad.


దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు అసదుద్దీన్. ఆ వేదికకు ఏ పేరు పెట్టినా అభ్యంతరం లేదని.. ఈ విషయంలో కేసీఆర్ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వేదిక ఏర్పాటులో తాము కేసీఆర్‌కు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్‌లో నిబద్ధత ఉందని.. ఆయన దెబ్బకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ బడా నేతలు ఓడిపోయారని గుర్తు చేశారు.

రాజకీయాల్లో చంద్రబాబును నమ్మలేమంటున్నారు అసద్. బీజేపీని గతంలో వ్యతిరేకించి మళ్లీ వారితోనే కలిశారని.. ఆయన విధానాల్లో నిలకడ లేదన్నారు. తెలంగాణలో బాబు ప్రచారం మాత్రమే కాదు.. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఏపీలో చంద్రబాబుకు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందంటున్నారు అసద్. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా గెలవలేదని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు అసదుద్దీన్. తాను కచ్చితంగా ఆంధ్రకు వెళ్లి తీరుతానని.. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో చూపిస్తాన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.