యాప్నగరం

మహానాడు: పసుపుమయమైన విశాఖ

విశాఖపట్నంలోని ఏయూ మైదానంలో మూడు రోజుల పాటూ జరిగే మహానాడుకు సర్వం సిద్ధమైపోయింది.

TNN 26 May 2017, 10:41 am
విశాఖపట్నంలోని ఏయూ మైదానంలో మూడు రోజుల పాటూ జరిగే మహానాడుకు సర్వం సిద్ధమైపోయింది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. ముప్పై వేల మందికి సరిపోయేలా భోజన ఏర్పాట్లు చేశారు. ఒకేసారి ఏడువేల మంది భోజనం చేయడానికి వీలయ్యే ఏర్పాటు పూర్తయింది. ఇందులో 18 రకాల వంటలను వండి వడ్డించనున్నారు. భోజన ఏర్పాట్లను మంత్రి అయ్యన్నపాత్రుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సరంజామా అంతా మహానాడు ప్రాంగణానికి వచ్చేసింది.
Samayam Telugu all set for tdp mahanadu in vizag
మహానాడు: పసుపుమయమైన విశాఖ


ఎన్టీరామారావు పార్టీని నిలబెట్టే క్రమంలో చేసిన రథయాత్ర ఫోటోలు, వివిధ సందర్భాల్లో తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తప్పెట గుళ్లు, పులి వేషాలు, థింసా నృత్యం, కోలాటం, బిందెల నృత్యం, పోతురాజులు, బతుకమ్మ ఇవన్నీ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఏయూ మైదానమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ లు, డాగ్ స్క్వాడ్ లు, మెటల్ డిటెక్టర్లు అన్నీ రంగంలోకి దిగాయి. ఏయూ పరిసరాలన్నీ పచ్చతోరణాలతో నిండిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.