యాప్నగరం

జిల్లాకో మహిళా కోర్టు..దేశంలో ఇదే ప్రథమం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో మహిళా కోర్టు ఏర్పాటుకానుంది.

Samayam Telugu 21 Dec 2016, 11:48 am
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో మహిళా కోర్టు ఏర్పాటుకానుంది. ఈ యేడాది దసరా పండుగ నాడు తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘షీ’ టీములతో మహిళలపై జరిగే దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలను అరికట్టడంలో ముందున్న రాష్ట్రం...మహిళలు దాఖలు చేసే ఫిర్యాదులు, కేసులు త్వరితగతిన తేల్చేందుకు మహిళా కోర్టులు పనిచేయనున్నాయి.
Samayam Telugu all telangana districts get women courts soon
జిల్లాకో మహిళా కోర్టు..దేశంలో ఇదే ప్రథమం


మహిళలపై జరుగుతున్నదాడులను అరికట్టడంతో పాటు అందుకు పాల్పడుతున్న బాధ్యులకు త్వరితగతిన శిక్షలు పడేలా అన్నిజిల్లాల్లో మహిళా కోర్టులు ఏర్పాటు చేయాలని గతంలో సుప్పీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనను ఏ రాష్ట్రం పెద్దగా అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మహిళా కోర్టును ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని జిల్లాలో మహిళా కోర్టులను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రికార్డు సాధించబోతుంది. ఇప్పటికే జిల్లాల్లో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మొదటి కోర్టును స్పెషల్ కోర్టుగా మార్చనున్నారు. మహిళలను భౌతికంగా, మానసికంగా హించించే వారికి కఠిన శిక్షలు పడేలా, త్వరితగతిన శిక్షలు అమలయ్యేలా ఈ కోర్టులు పనిచేస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, చోరీలు, కిడ్నాపుల వంటివి 2014 సంవత్సరంలో 11794 కేసులు నమోదుకాగా, వాటి సంఖ్య 12422కు పెరిగింది. దీంతో ప్రభుత్వం ‘షీ’టీములను చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.