యాప్నగరం

రాజకీయ రంగు పులుముకుంటున్న వివేకా మరణం

వైఎస్ వివేకానందరెడ్డి మరణం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆయన మృతికి చంద్రబాబు, లోకేశ్, అమర్‌నాథ్‌రెడ్డి కారణమని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలనం ఆరోపణలు చేశారు.

Samayam Telugu 15 Mar 2019, 2:27 pm
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు ఉదయం వార్తలు రాగా.. సమయం గడిచేకొద్దీ ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన పోలీసు శాఖ కడప జిల్లా అడిషనల్ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటుచేసింది.
Samayam Telugu YS-Vivekananda-Redd


అయితే వివేకానందరెడ్డి మృతి క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆయన మరణంపై అనేక అనుమానాలున్నాయని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి బంధువు, వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా మృతి వెనుక సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఆదినారాయణరెడ్డి హస్తం ఉందంటూ సంచలనం ఆరోపణలు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వివేకా మృతి బాధాకరమని, దీన్ని ఆసరాగా తీసుకుని తమ పార్టీపై నిందలు వేయడం సమంజసం కాదని కడప జిల్లా టీడీపీ నేత సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కడప ఎంపీ సీటు విషయంలో వివేకా, అవినాష్‌రెడ్డికి మధ్య వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే ఆయన చనిపోవడంతో కుటుంబసభ్యులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చావును సైతం రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లిందంటూ మండిపడ్డారు. వివేకానందరెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.