యాప్నగరం

​ఎన్టీఆర్ కేనా.. ఈ తెలుగు వాళ్లకూ ‘భారతరత్న’ ఇవ్వండి!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీఆర్ కు ‘భారతరత్న’

TNN 30 May 2017, 9:09 am
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేయాలని టీడీపీ యథావిధిగా ఈ ఏడాది మహానాడులో కూడా తీర్మానం చేసింది. ప్రతియేటా మహానాడులో టీడీపీ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం, ఆమోదించడం చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ఇక ఇదే సమయంలో ‘భారతరత్న’ పురస్కారానికి అర్హులైన తెలుగు మహనీయులు మరింతమంది ఉన్నారనే వాదన వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు విజయచందర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
Samayam Telugu alluri prakasarm also deserves bharatharatna
​ఎన్టీఆర్ కేనా.. ఈ తెలుగు వాళ్లకూ ‘భారతరత్న’ ఇవ్వండి!


అల్లూరి సీతారామారాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి వారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయకపోవడం బాధాకరం అని విజయచందర్ అన్నారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని పంచి ప్రాణాలను త్యాగం చేసిన అల్లూరికి భారతరత్న ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నేతల్లో ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, గుంటూరు వెంకన్న చౌదరి వంటి ఆదర్శనేతలున్నారని.. వారి పేర్లను భారతరత్నకు ప్రతిపాదించాలని విజయ చందర్ అభిప్రాయపడ్డారు.

భారతరత్న పురస్కారానికి ఎన్టీఆర్ పేరును ప్రతిపాదించడం సముచితమే అని, ఆయన తో పాటు మహనీయులైన తెలుగు వారికి కూడా భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జాతి ఔన్నత్యానికి పాటుపడిన వారికి ఆ పురస్కారం ఇవ్వాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.