యాప్నగరం

అవయవదానానికి నేనూ సిద్ధం.. లైసెన్స్‌ జారీకీ షరతు: చంద్రబాబు

తన పిలుపునకు స్పందించి అవయవ దానం చేయడానికి లక్షలాది మంది ముందుకురావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అవయవ దానం చేసేందుకు తానూ సిద్ధమని ప్రకటించారు.

Samayam Telugu 6 Aug 2018, 8:30 pm
తన పిలుపునకు స్పందించి అవయవ దానం చేయడానికి లక్షలాది మంది ముందుకురావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అవయవ దానం చేసేందుకు తానూ సిద్ధమని ప్రకటించారు. అమరావతి ప్రజావేదిక హాల్‌లో సోమవారం (ఆగస్టు 6) సీఎం చంద్రబాబు నాయుడు ‘హై ఎనర్జీ బెనిఫిటీ స్టోరేజీ బ్యాటరీ’ని లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం అవయవదాన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
Samayam Telugu babu


అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌లోనూ అవయవదానాన్ని ఒక షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. పది రోజుల కిందట చంద్రబాబు ఇచ్చిన పిలుపు అందుకొని లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

అసాధ్యాలను సుసాధ్యం చేయాలి..
అవయవ దానానికి ముందుకొచ్చిన దాతలు ఇచ్చిన పత్రాలను చంద్రబాబు సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు మెప్మా అందజేసింది. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద ఓ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపై యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పునరుద్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యంకాదన్న స్థాయి నుంచి చౌక ధరకు కాలుష్యరహిత ఇంధనం ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. కాలుష్య రహిత ఇంధనానికి ఏపీ నెలవు కావాలని ఆకాంక్షించారు.

భారత్‌ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చిన విద్యుత్‌ నిల్వ పరికరాన్ని పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల మధ్య చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. తక్కువ ధరకే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ ఇప్పుడు రూ.5కే లభిస్తోందని, దీన్ని రూ.1.50 నుంచి రూ.2కి తగ్గించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.