యాప్నగరం

ముగ్గురొస్తే టిఆర్ఎస్ నేతలకు మూర్ఛ ఖాయం

అమిత్ షా ఒక్కరు పర్యటిస్తేనే సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని,

Samayam Telugu 25 May 2017, 4:52 pm
అమిత్ షా ఒక్కరు పర్యటిస్తేనే సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అదే ముగ్గురు వస్తే మూర్ఛపోతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి వచ్చిన స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
Samayam Telugu amit shah shocked kcr telangana bjp takes on ts cm
ముగ్గురొస్తే టిఆర్ఎస్ నేతలకు మూర్ఛ ఖాయం


కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులు, పథకాలు ప్రజలకు చేరడం లేదని అమిత్ షా అంటే.. కేసీఆర్ మాత్రం తీవ్ర పదజాలంతో విమర్శించారని లక్ష్మణ్ అన్నారు. సెప్టెంబర్ లో అమిత్ తెలంగాణలో ఆరు రోజులపాటు పర్యటిస్తారని వెల్లడించారు.

కేంద్రం రాష్ట్రానికి రూ.90వేలకోట్లు ఇస్తే పూర్తిగా వినియోగించుకోలేకపోయిందని ఆరోపించిన లక్ష్మణ్... రూపాయికి కిలో బియ్యం పథకం కేంద్రం రూ.27 భరిస్తోందని, రాష్ట్రం రూ.2 మాత్రమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. ఆసుపత్రులకు రూ.1000కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్రం వాటా రూ.250కోట్లు ఇవ్వలేకపోయిందని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.