యాప్నగరం

మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టుచేశారు సిటీ పోలీసులు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్...

TNN 24 Jul 2017, 4:46 pm
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టుచేశారు సిటీ పోలీసులు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి రాచకొండ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో నేరేడ్‌మెట్‌లో ఆరుగురు సభ్యులు గల నైజీరియన్ల ముఠా పట్టుబడింది. అరెస్ట్ అయిన నిందితుల నుంచి 700 ఎల్ఎస్‌డీ స్ట్రిప్స్, 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, రూ.2 లక్షల నగదు, 2 ల్యాప్‌టాప్స్, 9 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu an other drugs racket busted in hyderabad
మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు


ఈ డ్రగ్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేసిన అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్.. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల వివరాలని వెల్లడించారు. గోవా నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలించి ఇక్కడ డ్రగ్స్ యూజర్లకి సరఫరా చేస్తున్న ఈ ముఠాలో విజయవాడకి చెందిన ఓ యువతి కూడా సభ్యురాలిగా వున్నట్టు పీసీ తెలిపారు. డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణ ఊపందుకున్న తర్వాత హైదరాబాద్‌లో పట్టుబడిన మరో డ్రగ్స్ రాకెట్ ముఠా ఇది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.