యాప్నగరం

ఆయన వైసీపీలో చేరబోతున్నారా? లేక!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం నేత ఆనం రామనారాయణ రెడ్డి వరస భేటీలు కొనసాగుతూ

Samayam Telugu 21 Jul 2018, 10:29 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం నేత ఆనం రామనారాయణ రెడ్డి వరస భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. మూడు వారాలుగా క్రమం తప్పకుండా జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అవుతున్నారు ఆనం. తెలుగుదేశం పార్టీలో గత కొన్నాళ్లుగా అసహనభరితులై ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఈ సీనియర్ పొలిటీషియన్ బహిరంగంగానే వాపోయారు. పార్టీలోకి చేర్చుకున్నప్పుడు బాబు తనకు చాలా హామీలు ఇచ్చారని, అవి అమలు కాలేదనేది ఆనం ప్రధానమైన ఫిర్యాదు.
Samayam Telugu Anam-Ramanarayana


ఈ నేపథ్యంలో ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు ఆనం. అయితే వైసీపీలో చేరిక గురించి మాత్రం ఎలాంటి ప్రకటన రావడం లేదు.

దీంతో చర్చలు, తర్జనభర్జనలు కొనసాగుతున్నట్టే అని అనుకోవాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆనం రామనారాయణరెడ్డిపై ఆశలేమీ పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదు. ఆనం వివేకానందరెడ్డి బతికున్న రోజుల్లోనే రామనారాయణ రెడ్డి టీడీపీని వీడబోతున్నారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు రంగంలోకి దిగి రామనారాయణ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా రామనారాయణ బెట్టు వీడకపోవడంతో టీడీపీ వైపు నుంచి ప్రయత్నాలు ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా ఆనం సాంకేతికంగా టీడీపీ నేతే. బేషరతుగా వైసీపీలోకి చేరాలని, భవిష్యత్తులో అవకాశాలిస్తామని ఆనం రామనారాయణరెడ్డితో జగన్ వ్యాఖ్యానించనట్టుగా వార్తలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.