యాప్నగరం

కాకినాడ కుర్రోడికి.. 2 కోట్ల జీతం

తండ్రి పోస్టాఫీస్‌లో చిన్న ఉద్యోగం .. కొడుకేమో ఆపిల్ సంస్థలో 2 కోట్ల జీతానికి భారీ ఆఫర్. సామర్లకోట కుర్రోడు ఈ ఘనత ఎలా సాధించాడు.

TNN 18 May 2017, 1:08 pm
తూర్పుగోదావరి జిల్లా కుర్రాడు కాలిఫోర్నియాలోని ఐఫోన్ల తయారీ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. అంతేకాదు ఏదాదికి రెండు కోట్ల రూపాయల జీతానికి ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా సామర్లకోట మండలం వీకే రాయపురానికి చెందిన అతి సామాన్య మధ్య తరగతి కుంటుంబం నుండి వచ్చిన దుర్గా లక్ష్మీనారాయణ స్వామి అలియాస్ దిలీప్ ఈ ఘనత సాధించి ఎంతో మంది యువకులకు ప్రేరణగా నిలిచారు.
Samayam Telugu andhra man gets job in apple with 2 crores package
కాకినాడ కుర్రోడికి.. 2 కోట్ల జీతం


దిలీప్ తండ్రి సుబ్బారావు పోస్టాఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ కొడుకుని చదివించారు. చిన్నప్పటినుండి కొడుకు చదువులో ముందు ఉండే దిలీప్ ఈ ఘనత సాధించడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తన కొడుకు చదువులో అందరికంటే ముందు ఉండే వాడని.. పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 556 మార్కులు సాధించి .. ఇంటర్‌లో వెయ్యికి 980 మార్కులు సాధించి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ ప్రతిభ చూపి హైదరాబాద్‌లో ఉద్యోగాన్ని సంపాదించాడని తెలిపారు.

తరువాత అక్కడితే దిలీప్ తన ప్రయత్నాన్ని వదిలేయలేదని క్యాట్‌లో 93.3 స్కోర్ సాధించి అమెరికాలో వర్జీనియా టెక్‌లో ఎంఎస్ సీటు సంపాదించి అక్కడా ప్రతిభ చూపి ఎంఎస్ పూర్తి చేయండంతో ఆపిల్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని దీలీప్ తండ్రి తెలిపారు. ఈనెల 22న దిలీప్ ఆపిల్ సంస్థలో తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి కాలిఫోర్నియా వెళ్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.