యాప్నగరం

తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు హస్తినాపురం సమాచారం.

TNN 28 Jul 2017, 9:52 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు హస్తినాపురం సమాచారం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఆంధ్రప్రదేశ్‌కు.. కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. వీరి నియామకంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుందట.
Samayam Telugu andhra pradesh and telangana to get separate governors
తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు!


ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం గత మార్చిలోనే ముగిసింది. దీంతో కొత్త గవర్నర్ల నియామకం జరిపేంత వరకూ కొనసాగాలని కేంద్రం ఆయనకి సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారట.

తొలుత రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ను నియమించాలని ముందు కేంద్ర ప్రభుత్వం భావించిందట. వాస్తవానికి, తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న పదేళ్లూ ఒకే గవర్నర్‌ ఉంటారని ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విజయవాడ నుంచే పాలన సాగిస్తోంది. కాబట్టి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండాల్సిన అవసరమేంటని కేంద్రం భావించిందట. అందుకనే రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించడానికి సన్నద్ధమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.