యాప్నగరం

ఏపీ బంద్‌: పాల్గొని నిరసన తెలిపిన జగన్

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం బంద్‌ కొనసాగుతోంది.

TNN 8 Feb 2018, 12:14 pm
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం బంద్‌ కొనసాగుతోంది. ఈ బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్, జ‌న‌సేన, వివిధ ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ బంద్‌కు సంఘీభావంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేడు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్‌ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్లకార్డులు పట్టుకుని బంద్‌కు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఏపీలోని పదమూడు జిల్లాల్లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచే వామ‌ప‌క్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు దిగాయి.
Samayam Telugu andhra pradesh bandh ys jagan participated at nellore
ఏపీ బంద్‌: పాల్గొని నిరసన తెలిపిన జగన్


రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట విద్యార్థులు, నేతలు బైటాయించి ఆందోళ‌న‌కు దిగడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే తిరుమ‌ల‌కు వెళ్లే బస్సుల‌కు మాత్రం బంద్ నుంచి మిన‌హాయింపునిచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుమలపైకి వాహనాలను అనుమతిస్తున్నారు. నిరసనకారులు బస్సులను ఎక్క‌డిక్క‌డ‌ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. చిన్న ఘ‌ట‌న‌లు మిన‌హా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకే పడుతుందని ప్రజానీకం గళమెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.