యాప్నగరం

సంక్షోభాలను తట్టుకొని కూడా నం.1: యనమల

విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణతి తీసుకురాగలిగామని, రెండున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని ఆర్థికమంత్రి అన్నారు.

TNN 15 Mar 2017, 12:05 pm
ఆంధ్రప్రదేశ్ రాష్టానికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 1,56,999.4 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. నోట్ల రద్దు లాంటి సంక్షోభాలను కూడా తట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
Samayam Telugu andhra pradesh finance minister yanamalas budget speech
సంక్షోభాలను తట్టుకొని కూడా నం.1: యనమల


పెద్ద నోట్లను రద్దు చేసినా ఏపీ ప్రజలు ధైర్యం కోల్పోకుండా.. సంయమనంతో వ్యవహరించి అభివృద్ధికి తోడ్పాటు అందించారని ఆయన ప్రసంసించారు. విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణతి తీసుకురాగలిగామని, రెండున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని ఆర్థికమంత్రి అన్నారు. ఇలాంటి సంక్షోభాలు కొత్త పాఠాలను నేర్పాయని, వాటితో ముందడుగు వేయడానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.