యాప్నగరం

ఏపీ: అన్న క్యాంటీన్లు ప్రారంభం.. నాణ్యత విషయంలో రాజీ లేదన్న బాబు

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో 'అన్న క్యాంటీన్లు' బుధవారం (జులై 11) ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని విద్యాధరపురంలోని 'అన్న క్యాంటీన్‌'ను లాంచనంగా ప్రారంభించారు.

Samayam Telugu 11 Jul 2018, 3:48 pm
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో 'అన్న క్యాంటీన్లు' బుధవారం (జులై 11) ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని విద్యాధరపురంలోని 'అన్న క్యాంటీన్‌'ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు.
Samayam Telugu anna-cantin1


అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికి నాణ్యమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి మహిళలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేసిన చంద్రబాబు.. క్యాంటీన్‌లోని ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. త్వరలోనే మరో 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యంకానుంది. ప్రతీ రోజు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వ్యక్తికి గరిష్ఠంగా రెండు టోకెన్ల వరకు జారీచేసే అవకాశం ఉంది. ఆహార సరఫరా బాధ్యత 'అక్షయపాత్ర' సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.