యాప్నగరం

ఆంధ్రా ఆరోగ్య శ్రీ హైదరాబాద్‌లో పనిచేయదా ?

అనారోగ్యం బారినపడిన నిరుపేదలకి కొండంత అండని అందించిన ఆరోగ్య శ్రీ పథకం అమలుపై అనేక...

TNN 14 Jul 2017, 11:38 pm
అనారోగ్యం బారినపడిన నిరుపేదలకి కొండంత అండని అందించిన ఆరోగ్య శ్రీ పథకం అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే వైద్య సేవలపై పలు నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. ఇకపై ఆరోగ్యశ్రీ పథకం హైదరాబాద్‌లో వర్తించకుండా ఏపీ ప్రభుత్వం ఓ కొత్త జీవోని విడుదల చేసినట్టు వార్తలొస్తున్నాయి. కేవలం క్యాన్సర్‌ చికిత్సకు మాత్రమే మినహాయింపుని ఇస్తూ మిగతా వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్‌లోనే పొందాల్సిందిగా ఈ జీవోలో పేర్కొన్నారనేది సదరు వార్తల సారాంశం.
Samayam Telugu andhra pradesh govts aarogya sri scheme may not work in hyderabad
ఆంధ్రా ఆరోగ్య శ్రీ హైదరాబాద్‌లో పనిచేయదా ?


ఒకవేళ అదే కానీ నిజమైతే, ఇకపై హైదరాబాద్‌లో పేరున్న కార్పొరేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయం పొందేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అందుబాటులో వుండదు. క్యాన్సర్ వ్యాధికి అవసరమయ్యే చికిత్స మినహాయించి మిగతా అత్యవసర వైద్య సేవలు ఏవైనా మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వున్న ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాల్సి వుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.