యాప్నగరం

తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం!

విభజన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. వాటిలో కొన్నింటికి తాత్కాలికంగా తెరపడినా, ఇంకొన్ని మాత్రం కొనసాగుతున్నాయి.

TNN 29 Jul 2017, 3:29 pm
విభజన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. వాటిలో కొన్నింటికి తాత్కాలికంగా తెరపడినా, ఇంకొన్ని మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా మరో వివాదం తలెత్తింది. ఓ ఎత్తిపోతల పథకం ఏపీ, తెలంగాణ మధ్య తాజా వివాదానికి కారణమైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పాలేరు వాగుపై రూ. 25 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఎత్తిపోతల వల్ల తమ ప్రాంతంలోని కోదాడ మండలంలో పలు గ్రామాలకు తాగునీటి కొరత ఏర్పడుతుందంటూ తెలంగాణ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కోదాడ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ శశిధర్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
Samayam Telugu andhra pradesh vs telangana paleru river disputes
తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం!


ఎత్తిపోతల పథకం పనులను చేపడితే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదం ప్రారంభమైనట్టైంది. ఇప్పటికే అనేక వివాదాలు నడుస్తుండగా, తాజా సమస్య వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో మరి. నీటి వనరుల విషయంలో ఇది మరో కొత్త సమస్య. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్ట్‌ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.