యాప్నగరం

ఆంధ్రాలో ఇక మజ్జిగ పంపిణీ

ఎండలకి ఆంధ్రా ప్రాంతం అగ్నిగోళంలా మండుతోంది.

TNN 19 Apr 2016, 1:12 pm
ఎండలకి ఆంధ్రా ప్రాంతం అగ్నిగోళంలా మండుతోంది. వడదెబ్బకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. చలివేంద్రాల్లాగే... మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించింది. అందుకోసం 39కోట్ల రూపాయలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లకు వెంటనే సహాయకచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. జిల్లాకు రూ.3 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు తెలిపింది. వడదెబ్బకు ఒక్క ప్రాణం కూడా పోకూడదని కలెక్టర్లను ఆదేశించింది. మంత్రులు తమతమ జిల్లాల్లో ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రోజురోజుకి రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో... అక్కడ ఎక్కువ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.