యాప్నగరం

ఈ బీజేపీ నేత కూడా రేవంత్ బాటలో..?

ఈ సీనియర్ పొలిటీషియన్ కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

TNN 20 Oct 2017, 3:01 pm
ఒకవైపు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం దాదాపు ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో సంప్రదింపులు పూర్తి చేశారని, రేవంత్ తో పాటు మరికొందరు టీటీడీపీ లీడర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి లొల్లి కొనసాగుతోంది. ఈ సంగతిలా ఉంటే.. ఇప్పుడు తెలంగాణకే చెందిన మరో సీనియర్ పొలిటీషియన్ కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీలో తగిన గుర్తింపు లేక బాధలో ఉన్న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఆయన మరెవరో కాదు... సీనియర్ పొలిటిషియన్ నాగం జనార్ధన్ రెడ్డి.
Samayam Telugu another reddy to follow revanth footsteps
ఈ బీజేపీ నేత కూడా రేవంత్ బాటలో..?


తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. అనంతర పరిణామాల్లో ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగం. ఇక ఎన్నికల అనంతరం బీజేపీలో నాగం సర్దుకుపోలేకపోతున్నారు. మూడున్నర సంవత్సరం గడిచిపోయినా.. ఇప్పటి వరకూ కమలనాథులకు నాగం జనార్ధన్ రెడ్డికి మధ్య అంతరాలు తొలగలేదు. ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బీజేపీని వీడనున్నారనే వార్తలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డి తీరునే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగం తెరాసవైపు వెళ్లే అవకాశం లేదని, బీజేపీలో ఆయన సెట్ కాలేకపోతున్నారని.. దీంతో కాంగ్రెస్సే మిగిలిన మార్గమని.. రేవంత్ కు కాస్త అటూఇటూగా నాగం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.