యాప్నగరం

నవ్యాంధ్రలో 100శాతం విద్యుత్ కనెక్షన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది

Samayam Telugu 24 Jun 2016, 9:57 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది. దేశంలో వంద శాతం విద్యుత్ కనెక్షన్లు కలిగిన తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, దక్షిణాది రాష్ట్రాల్లో తొలిదానిగా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మనదేశంలో ఇప్పటివరకు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే తమ రాష్ట్ర ప్రజలకు నూటికి నూరు శాతం విద్యుత్ కనెక్షన్లను అందించిన ఘనతను కలిగిఉండగా వాటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. కేవలం వంద శాతం విద్యుదీకరణే కాకుండా, విద్యుత్ కనెక్షన్ల అనుసంధానాన్ని డిజిటలైజ్ చేసిన తొలి రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. శుక్రవారం నాడు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. త్వరలో ఇంటింటికి స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా విద్యుత్ చౌర్యాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా విద్యుత్ పంపిణీ, బిల్లింగ్ వ్యవహారాలు సజావుగా సాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉదయ్ లో చేరిన ఆంధ్రప్రదేశ్
Samayam Telugu ap among top three 100 percent electrified states
నవ్యాంధ్రలో 100శాతం విద్యుత్ కనెక్షన్లు


విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ సీఎం, విద్యుత్ మంత్రులు ఏపీ సీడ్కోను ప్రారంభించారు. ఆ తరువాత ఏపీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయిన ఉదయ్ లో చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.