యాప్నగరం

Chandrababu Naidu: మా కుటుంబానికి తీరని లోటు - హరికృష్ణ మృతిపై బాబు ఆవేదన

నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 29 Aug 2018, 11:17 am
నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు అమరావతి నుంచి హుటాహుటిన నల్లగొండలోని కామినేని ఆసుపత్రికి బయల్దేరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని సీఎం ఆవేదన చెందారు. హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, తెలుగువారికి తీరని లోటని, ఆ లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, సాంఘిక, పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని కొనియాడారు. చిత్ర పరిశ్రమకు, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారని, ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టుడని అన్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథసారథిగా వ్యవహరించి ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశారని గుర్తుచేశారు. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
Samayam Telugu ఏపీ సీఎం చంద్రబాబు


హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం నిద్ర లేవగానే హరికృష్ణకు జరిగిన ప్రమాదం గురించి తెలిసిందని, ఆ వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకోవాలని పురమాయించానని అన్నారు. అయితే, కాసేపటికే మరణించారన్న వార్త తెలిసి తట్టుకోలేకపోయానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సినీ రాజకీయాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో తాను హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా మెలిగానని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.