యాప్నగరం

శాసనసభ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వీరు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.

TNN 10 Mar 2017, 7:34 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా పూర్తి అయ్యింది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు మంది, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వీరు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.
Samayam Telugu ap and ts mlc eletions
శాసనసభ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం


తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, అర్జునుడు, పోతుల సునీతలు ఎమ్మెల్సీలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర రెడ్డిలు ఎన్నికయ్యారు.

నూతన ఎమ్మెల్సీలు తమ తమ పార్టీల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. తమకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మండలిలో ప్రజాసమస్యలను ప్రస్తావిస్తామన్నారు.

తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవంగానే ముగిసింది. మైనంపల్లి హన్మంతరావు, ఎలిమినేటి క్రిష్టారెడ్డి, గంగధర గౌడ్ లు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.