యాప్నగరం

విభజన హామీల్లో మూడే పెండింగ్: బీజేపీ!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ చేయలేదంటూ తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు.

Samayam Telugu 11 Mar 2018, 2:55 pm
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ చేయలేదంటూ తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఏపీకి కేంద్రం చేయాల్సిన సాయమంతా చేస్తోందని.. విభజన చట్టంలోని మిగిలి ఉన్న హామీలను త్వరలోనే నెరవేరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందని కొందరు విమర్శించడం దారుణమని హరిబాబు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్క జాతీయ సంస్థ కూడా లేదని, మూడేళ్లలో తమ ప్రభుత్వం తొమ్మిది ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఇంకా మూడు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాలతో చర్చించిన అనంతరం విశాఖ రైల్వేజోన్ వస్తుందని, కడపలో ఉక్కు పరిశ్రమ, ఓడరేవు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu ap bjp president interesting comments about bifurcation guarantees
విభజన హామీల్లో మూడే పెండింగ్: బీజేపీ!


బీజేపీ వల్లే రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి చెందిందని తాను ఆత్మవిశ్వాసంతో చెప్పగలనని హరిబాబు ఉద్ఘాటించారు. మరో నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సాయపడుతోందని, తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు టీడీపీతో సహ ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సోము పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.