యాప్నగరం

జనాల ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు..

విజయవాడ: క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షత ఏపీ కేబినెట్ సమావేశమైంది.

TNN 15 Nov 2016, 8:29 pm
విజయవాడ: సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈభేటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప సహా మంత్రులందరూ పాల్గొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇబ్బందులు తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలనఏపీ కేబినెట్ తీర్మానించింది. నాలుగు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Samayam Telugu ap cabinet meeting
జనాల ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు..


ఏపీ కేబినెట్ నిర్ణయాలు...

* విజయవాడ సిద్ధార్థ కాలేజీ భూముల లీజు ధరను పెంచాలని నిర్ణయం

* ఏపీ ఫైబర్ నెట్ కోసం 10 లక్షల సెటాప్ బాక్సులు కోనుగోలు చేయాలని నిర్ణయం

* అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

* కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం ఏపీటీటీసీకి అప్పగించాలని నిర్ణయం

* అమృత యూనివర్శిటీకి 200 ఎకరాలు భూమి ఇవ్వాలని నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.