యాప్నగరం

వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

Samayam Telugu 22 Aug 2018, 5:39 pm
ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్ష చేశారు. వరద, పంటనష్టంపై ఆరా తీసి.. సహాయక చర్యలపై వారితో చర్చించారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులు సూచించారు.
Samayam Telugu Babu


ఉభయగోదావరి జిల్లాల్లో వరదలతో తీవ్రంగా నష్టపోయాయన్నారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలోని 45 గ్రామాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉందని.. బాధితుల కోసం 15కుపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా విషయానికొస్తే.. ఎర్రకాలువతో ఎక్కువ నష్టంవాటిల్లిందన్నారు. వరద నీటితో చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయన్నారు. అలాగే ఎర్రకాలువ ముంపు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి వరదల వల్ల రూ.600కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నామన్నారు సీఎం. కాజ్‌వేల పున:నిర్మాణానికి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లకు నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే పంటనష్టానికి పరిహారం చెల్లిస్తామన్నారు. కోస్తాను వరదలు ముంచెత్తుతుంటే.. రాయలసీమను కరువు వెంటాడుతోందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 57 ప్రధాన ప్రాజెక్టులు చేపట్టామని.. వాటిలో 16 పూర్తయ్యాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.