యాప్నగరం

Araku Mla: కిడారి కుటుంబానికి బాబు పరామర్శ.. రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం

సర్వేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం.. అన్ని విధాలుగా ఆదుకుంటాం.. విశాఖలో ఇంటి నిర్మాణానికి సహకరిస్తాం.. రూ.కోటి ఆర్థికసాయం..

Samayam Telugu 28 Sep 2018, 2:32 pm
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గురువారం పాడేరు వెళ్లిన సీఎం.. కిడారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ముందుగా సర్వేశ్వరరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిడారి కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చారు.. అండగా ఉంటామంటూ ఆయన కుమారులకు ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబులు కూడా ఉన్నారు.
Samayam Telugu Babu..


గిరిజనుల కోసం సర్వేశ్వరరావు ఎనలేని సేవలందించారన్నారు చంద్రబాబు. ఆయన మంచి నాయకత్వం లక్షణాలున్న నేతని కొనియాడారు. కిడారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రూ.కోటి ఆర్థికసాయం, విశాఖలో ఇంటి నిర్మాణానికి సహకరిస్తామన్నారు. అలాగే ఆయన చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మొదటి నుంచి తాము బాక్సైట్‌కు వ్యతిరేకమని.. నేతల్ని చంపాడనికి మావోయిస్టులుకు ఇది నెపం మాత్రమేనన్నారు. అభివృద్ధికి పాటుపడేవారిని చంపితే.. గిరిజన ప్రాంతాలు ఎలా బాగుపడతాయన్నారు సీఎం.

గత ఆదివారం విశాఖ జిల్లా లివిటిపుట్టలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను అతిదారుణంగా మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండటంతో.. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.