యాప్నగరం

Chandrababu Naidu: ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య.. సీఎం, జగన్, పవన్ సంతాపం

ప్రత్యేక హోదా కోసం విశాఖలో ఆత్మహత్య చేసుకున్న యువకుడికి సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ విచారం వ్యక్తం చేశారు.

Samayam Telugu 1 Sep 2018, 8:34 am
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెచ్చేందుకు అంతా పోరాడాలని, కేరళ వరద బాధితులను ఆదుకోడానికి పిలుపిచ్చినట్లే.. సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులంతా ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని కోరుతూ.. శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖలో ఏపీ సీఎంను ఉద్దేశిస్తూ.. తన బాధను వ్యక్తం చేశాడు.
Samayam Telugu Untitled11aaa


రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) అనే యువకుడు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకుందామని, ఎవరూ బలిదానాలు తీసుకోవద్దని సూచించారు. త్రినాథ్ ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని అన్నారు.

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రత్యేక హోదాని పోరాటాలతో సాదిద్దామని, యువత తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. దొడ్డి త్రినాథ్ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి మనసు వికలమైందన్నారు. అతని మరణం కన్నవారికి ఎంత శోకం మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి హామీ నిలబెట్టుకోవాలన్నారు. దయచేసి ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని, రాష్ట్రానికి హోదా దక్కే వరకు పోరాడదామని పవన్ పిలునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.