యాప్నగరం

టీడీఎల్పీలో 'మహానటి'పై చర్చ

అమరావతిలో జరుగుతున్న టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో మహానటి సినిమాపై ఆసక్తికర చర్చ జరిగిందట. మహనటి చాలా బాగుందని కొందరు తనతో చెప్పారని... ఎలా ఉందని నేతలను కూడా అడిగారట.

Samayam Telugu 11 May 2018, 5:35 pm
అమరావతిలో జరుగుతున్న టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో మహానటి సినిమాపై ఆసక్తికర చర్చ జరిగిందట. మహనటి చాలా బాగుందని కొందరు తనతో చెప్పారని... ఎలా ఉందని నేతలను కూడా అడిగారట. జీవిత చరిత్రలపై చిత్రాలు తీస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని... తాను కూడా ఈ సినిమాను చూస్తానని చెప్పారట సీఎం. తర్వాత చంద్రబాబు మహానటిపై ఎంపీ మురళీ మోహన్‌తో చర్చిస్తుండగా... టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్‌వైపుకు కూడా మళ్లిందట. ఈ ప్రాజెక్ట్‌పై కూడా ఇద్దరి మధ్య చర్చ నడిచిందట.
Samayam Telugu MahaNati..


ఈ సినిమాకు సంబంధించిన కథను తాను విన్నానని మురళీ మోహన్ చంద్రబాబుతో అన్నారట. ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం చేసే వరకే మొదటి భాగంలో ఉందని... ఈ ప్రాజెక్ట్ కూడా అందరికి తప్పకుండా నచ్చుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.