యాప్నగరం

ఆ సమితిలో తీసుకున్న రుణాలు చెల్లించకండి

శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని, వారు నిర్వహిస్తోన్న సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించొద్దని ఏపీ సీఎం అన్నారు.

TNN 20 Aug 2017, 2:15 pm
శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని, వారు నిర్వహిస్తోన్న సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించొద్దని, ఆ సమితి నిర్వహణ చట్టవిరుద్ధమని నంద్యాలలో రెండో రోజు ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు స్థానిక ఫంక్షన్ హాల్ లో ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశం అయ్యారు. అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, అరాచకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని, పేదల భూములను కాజేసి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వారికి అండగా నిలవాల్సిందిపోయి అరాచకాలకు పాల్పడుతున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu ap cm chandrababu naidu canvasing today at nandyal
ఆ సమితిలో తీసుకున్న రుణాలు చెల్లించకండి


ముస్లింలను అన్నివిధాలా ఆదుకున్నది టీడీపీనేనని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ముస్లింల సమస్యలను టీడీపీ అధినేత అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు చేసే వారికి ప్రజలు సహకరిస్తారని ఆయన అన్నారు. కులం, మతం పేరుతో కుట్రలు పన్నాలని చూస్తే ఊరుకునేది లేదని, ముస్లింలను అన్నిరంగాల్లో అభివృద్దిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, బడ్జెటల్ లో ముస్లింలకు అధిక నిధులు కేటాయించామని తెలిపారు. శాసనమండలి చైర్మన్ పదవిని ముస్లింలకే కేటాయిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాల ఉపఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నెల 23 న ఎన్నిక పోలింగ్ జరగనుండగా, 28 న ఫలితాలు వెలువడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.