యాప్నగరం

భయపడే ప్రసక్తే లేదు..ఇక సమరమే: చంద్రబాబు

ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన ఆయన... పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ప్రధాని, కేంద్రం తీరుపై మండిపడ్డారు.

Samayam Telugu 12 Apr 2018, 3:15 pm
ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన ఆయన... పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ప్రధాని, కేంద్రం తీరుపై మండిపడ్డారు. ప్రధాని మోదీ విషయంలో రాజీ పడేది లేదని ... తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరు ఆగదన్న ఆయన... ప్రజల్లో కూడా ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అయ్యారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని... ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు సీఎం.
Samayam Telugu Babu


బీజేపీ ఎంపీల దీక్షలపైనా చంద్రబాబు స్పందించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి దీక్ష చేయడం దేశ చరిత్రలో లేదని... రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని... ఏపీలో అభివృద్ధి ఆగిపోతే కేంద్రంలో మోదీ ఆనందపడతారన్నారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మోదీ ఆనందపడేలా ప్రవర్తిస్తున్నాయన్నారు బాబు. హోదా విషయంలో మరికొన్ని రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారని... దీని వల్ల వారే నష్టపోతారని గుర్తిస్తే మంచిదన్నారు. బంద్‌లు రాస్తారోకోలు చేసినా రాష్ట్రానికే నష్టమన్నారు చంద్రబాబు. ఇక్కడ ఉండి ఆందోళనలు చేస్తే ఉపయోగం లేదని... ఢిల్లీ వెళ్లి నిరసనను తెలిపితే మంచిదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.