యాప్నగరం

వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఉభయ గోదావరి ప్రజలు సహకరించిన తీరు అభినందనీయమని, ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

TNN 30 Dec 2016, 8:02 pm
పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఉభయ గోదావరి ప్రజలు సహకరించిన తీరు అభినందనీయమని, ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Samayam Telugu ap cm chandrababu naidu launches polavaram concrete works
వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన చంద్రబాబు


పోలవరం ప్రాజెక్టు కింద 7 ముంపు మండలాలను తెలంగాణలో కలిపి పోలవరంను అడ్డుకునే ప్రయత్నం చేసారని, ఒక వేళ వాటిని ఆంధ్రప్రదేశ్‌లో కలపకుంటే పోలవరం ఎప్పటికి పూర్తయ్యేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే పోలవరం పనులు ముందుకు సాగుతున్నాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నివిధాలా సహకరించారని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలకు పుష్కలంగా నీరందతుందని, అప్పుడు శ్రీశైలం నీళ్లు రాయలసీమకు వాడుకోవచ్చని వివరించారు.

బ్రిటిష్ రాజ్యం నుంచి వచ్చిన సర్ ఆర్ధర్ కాటన్ ఆ రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకున్నారని, అది సాధ్యం కాకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారని సీఎం గుర్తుచేసారు. ధవళేశ్వరం బ్యారేజీ వల్ల ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయని, అందుకనే కాటన్ దొరను తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలు దేవుడిగా భావిస్తున్నారన్నారు. 2019లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అకింతం చేయాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పోలవరం జలవిద్యుత్‌ కేంద్రంలో 80 మెగావాట్లు విద్యుత్‌‌ను ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.